దొంగలుపడ్డారు..
పర్లాకిమిడి: స్థానిక ఎం.ఆర్.బోయ్స్ హైస్కూల్ జంక్షన్ (14 వార్డు) వద్ద నివాసం ఉంటున్న నర్సింగ బిశ్వాళ్ అలియాస్ కుక్కు ఇంటిలో దొంగలుపడ్డారు. మూడు తులాల బంగారం, రూ.50వేల నగదు దోచుకున్నట్లు ఆదర్శ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నర్సింగ బిశ్వాళ్ నాలుగు రోజులుగా ఇంటికి తాళం వేసి రూర్కెలాకు తన పిల్లలతో వెళ్లాడు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తాళాలు విరిగి ఉండటంతో నర్సింగ బిశ్వాళ్‌కు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎ.ఎస్.ఐ తపన్ కుమార్ పాడి వచ్చి దొంగతనం ఎలా జరిగిందో దర్యాప్తు చేశారు. ఇంటికి వెనుకభాగం హైస్కూల్ ప్రహరి ఉండటంతో అక్కడి నుంచే తలుపులు పగలు గోట్టి దుండగులు ఇంటి లోపలికి చోరబడి బీరువా లాకర్ ఇరగ్గోట్టి నగదు, బంగారం ఎత్తుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దాచుకున్న నగదు, బంగారం పోవడంతో ఇంటి యజమాని నర్సింగ బిశ్వాళ్ కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మూడు తులాల బంగారం, రూ.50 వేల నగదు చోరీ
దొంగలుపడ్డారు..
Comments
Please login to add a commentAdd a comment