బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నబకిశోర్
పర్లాకిమిడి: గజపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా రాయఘడ మాజీ చైర్మన్ నబకిశోర్ శోబోరో ఎన్నికై నట్టు బీజేపీ ఎన్నికల అధికారి ప్రదీప్ చంద్ర షడంగి ప్రకటించారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి బీజేపీ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన నూతన అధ్యక్షుడు నవకిశోర్ శోబోరోకు మాజీ అధ్యక్షుడు కోడూరు నారాయణరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నబకిశోర్ శోబోరో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మోహాన్ చరణ్ మఝి, బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు తనపై విశ్వాసం ఉంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారన్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మోహానా, పర్లాకిమిడి నియోజికవర్గాల్లో ఎక్కువ స్థానాలను బీజేపీ అభ్యర్థులు కై వసం చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. గజపతి జిల్లాలోని మాజీ నాయకులు, యువతను కలిసి బీజేపీలో నూతన ఉత్తేజం కల్పిస్తానన్నారు. గ్రామాలు, పట్టాణాల్లో విస్తృతంగా పర్యటిస్తానన్నారు. బీజేపీ సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment