జోరుగా నకిలీ స్టాంపుల విక్రయాలు
వీరఘట్టం: వీరఘట్టంలో కొంతమంది వ్యక్తులు నకిలీ స్టాంపుల విక్రయాలకు పాల్పడుతున్నారు. గతంలో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొనుగోలు చేసిన రూ.10, రూ.50 స్టాంపు పేపర్లను పోలిన మాదిరిగానే కలర్ జిరాక్స్‌లు తీసి అడ్డుగోలు వ్యాపారానికి తెరతీశారు. భూముల కొనుగోళ్లు, ఇతర లావాదేవీల కోసం ఈ స్టాంపు పేపర్లు అవసరమైన వారు అవి నకిలీ అని తెలియక కొనుగోలు చేస్తున్నారు.ఈ నకిలీ స్టాంపుల వ్యవహారంపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పూరిల్లు దగ్ధం
దత్తిరాజేరు: మండలంలోని టి.బూర్జవలసలో చింతగడ ప్రసాద్‌కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైనట్లు సర్పంచ్ మంత్రి క్రాంతికుమార్, ఎంపీటీసీ మంత్రి అప్పలనాయుడు గురువారం తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో వచ్చి మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారని చెప్పారు. నిరుపేద అయిన ప్రసాద్‌కు చెందిన ధాన్యం, బియ్యం, పప్పు దినుసులు టీవీ ఇతర ఇంటి సామగ్రి బట్టలు, ఈ ప్రమాదంలో కాలి బూడిదవడంతో కటుంబసభ్యులు రోడ్డున పడ్డారని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
మాజీ ఎంపీటీసీకి తీవ్రగాయాలు
రామభద్రపురం: మండలంలోని దుప్పలపూడి గ్రామం సమీపంలో గురువారం బైక్‌పై వెళ్తున్న మాజీ ఎంపీటీసీని ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొనడంతో మాజీ ఎంపీటీసీకి తీవ్రగాయాలయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతరేగ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పెద్దింటి పైడిపునాయుడు తన అత్తయ్య ఆరోగ్యం బాగులేకపోవడంతో బొబ్బిలి తీసుకెళ్లాడు.అక్కడ వైద్యాధికారికి చూపించి తిరిగి సొంత గ్రామానికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో సరిగ్గా దుప్పలపూడి జంక్షన్‌కు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టి తప్పించుకుని పరారయ్యాడు. వెంటనే స్థానికులు పైడిపునాయుడిని ప్రథమచికిత్స నిమిత్తం స్థానిక ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై క్షతగాత్రుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు స్పందించిన ఎస్సై వి.ప్రసాదరావు ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరిచారు.ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరనం కొత్తరేగలో వివాహం జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తుండగా ఢీ కొట్టింది తానేనని అదే గ్రామానికి చెందిన చొక్కాపు గౌరీశ్వరరావు ఎస్సై ముందు అంగీకరించాడు. దీంతో ఎస్సై కేసు నమోదు చేశారు.
ఎన్‌డీఏ, ఐఎన్‌ఏకు సైనిక పాఠశాల విద్యార్థుల అర్హత
విజయనగరం రూరల్: యూపీఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), ఇండియా నేవల్ అకాడమీల్లో (ఐఎన్‌ఏ) ప్రవేశాలకు కోరుకొండ సైనిక పాఠశాల విద్యార్థులు 8 మంది అర్హత సాధించారని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్‌ఎస్ శాస్త్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయగా కోరుకొండ పాఠశాలకు చెందిన 8 మంది ఈ ఏడాది ఎన్‌డీఏ, ఐఎన్‌ఏకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ఎన్‌డీఏ, ఐఎన్‌ఏల్లో ప్రవేశాలే లక్ష్యంగా అందిస్తున్న శిక్షణ, కార్యకలాపాలే ఈ విజయానికి కారణమన్నారు. ఇంతటి విజయానికి కారకులైన పాఠశాల అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.
జోరుగా నకిలీ స్టాంపుల విక్రయాలు
జోరుగా నకిలీ స్టాంపుల విక్రయాలు
Comments
Please login to add a commentAdd a comment