విజయనగరం: రాష్ట్రంలో బాధ్యతగల ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్పార్‌సీపీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీలో నూతన నియామకాలు చేపడుతూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. నూతనంగా నియామకమైన నాయకులు రానున్న నాలుగు సంవత్సరాల పాటు పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
నూతన నియామకాలు ఇవే..
నూతన నియామకాల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజాంకు చెందిన టంకాల అచ్చంనాయుడు, బొబ్బిలి నుంచి చొక్కాపు లక్ష్మణరావు, నెల్లిమర్ల నుంచి పతివాడ అప్పలనాయుడు, విజయనగరం జిల్లా కేంద్రం నుంచి సీనియర్ కార్పొరేటర్ శెట్టి వీర వెంకట రాజేశ్వరరావు, గజపతినగరం నుంచి పాండ్రంకి సంజీవరావు, చీపురుపల్లి నుంచి శిరవూరు వెంకటరమణ రాజు, ఎస్ కోట నుంచి నూకల కస్తూరి నియామకమయ్యారు. జిల్లా పార్టీ కోశాధికారిగా రాజాం నియోజకవర్గానికి చెందిన సిరిపురపు. జగన్ మోహన్ రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గజపతినగరం నుంచి వర్రి నరసింహమూర్తి, నెల్లిమర్లకు చెందిన అల్లాడ సత్యనారాయణమూర్తి, చీపురుపల్లి నుంచి ఇప్పిలి అనంత్ , విజయనగరం నుంచి సంగంరెడ్డి.బంగారు నాయుడు, బొబ్బిలి నుంచి తమ్మిరెడ్డి దామోదర్ రావులు నియమితులయ్యారు. అదేవిధంగా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా విజయనగరం నుంచి బొద్దాన అప్పారావు, కిలారి రాంబాబు, గజపతినగరం నుంచి తొత్తడి సత్తిబాబు, సుంకరి రామునాయుడు, బొబ్బిలి నుంచి చెలికాని.మురళీకష్ణ, ఆవు సత్యనారాయణ, రాజాం నుంచి కనకాల సన్యాసినాయుడు, కిమిడి ఉమామహేశ్వరరావులను నియమించారు. ఎస్.కోట నుంచి పినిశెట్టి వెంకటరమణ, పినిశెట్టి కష్టప్ప దొర, చీపురుపల్లి నుంచి శీర.అప్పలనాయుడు, నెల్లిమర్ల నుంచి లంక లక్ష్మణరావు, కర్రోతు వెంకటరమణలు నూతన కమిటీలో స్థానం దక్కించుకున్నారు. జిల్లా కార్యదర్శులుగా విజయనగరానికి చెందిన దుప్పాడ సునీత, కునుకు నాగరాజు, గజపతినగరం నుంచి బండారు బంగారమ్మ, సుమల గోవింద, బొబ్బిలి నుంచి సీహెచ్ సత్యనారాయణ, భమిడిపాటి విశ్వనాథశర్మ, రాజాం నుంచి ఎస్.రమేష్ నాయుడు, గడి మధుసూదనరావు, ఎస్.కోట నుంచి ఎం.అప్పారావు, పల్లా భీష్మా, చీపురుపల్లి నుంచి కొణిశి కృష్ణంనాయుడు, కరిమజ్జి శ్రీనివాసనాయుడు, నెల్లిమర్ల నుంచి బుగత రమణ, జి.మురళీమోహనరావులు నియామకమయ్యారు. అదేవిధంగా పార్టీ స్పోక్స్ పర్సన్‌గా రాజాం నుంచి ఉత్తరావల్లి సురేష్‌ముఖర్జీ, బొబ్బిలి నుంచి బి.సత్యనారాయణ, చీపురుపల్లి నుంచి రేగిడి లక్ష్మణరావు, గజపతినగరం నుంచి కరణం ఆదినారాయణ, నెల్లిమర్ల నుంచి సముద్రపు రామారావు, విజయనగరం నుంచి కనకల రఘురామారావు, ఎస్.కోట నుంచి గొర్లె రవికుమార్‌లు నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment