వివాహ వేడుక
పర్లాకిమిడి: ‘కహానా’ చారిటబుల్ ట్రస్టు (బరంపురం) 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గీతాభవన్‌లో గురువారం పేద వధూవరులకు సామూహిక వివాహ వేడుకను నిర్వహించారు. గంజాం జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన ఎనిమిది జంటలను ఎంపిక చేసి వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు బరంపురం గీతా భవన్‌లో ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు ముఖ్యఅతిథిగా అరూత్, ట్రస్టు అధ్యక్షుడు రంజనా మిశ్రా విచ్చేశారు. నూతన వధూవరూల తరఫున పెద్ద సంఖ్యలో బంధువులు హాజరయ్యారు. సంప్రదాయ సిద్ధంగా కానుకలు చదివించారు. నూతన వధూవరులకు హిందూ సంప్రదాయం ప్రకారం బహుమతులు, గృహోపకరణాలను ట్రస్టు సభ్యులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment