శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ముఖ్య ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ పరిశ్రమలు, పలు కార్పొరేట్ యాజమాన్య ప్రతినిధులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచినీటి వసతి, సోలార్ లైట్ల ఏర్పాటు, పాఠశాలలు, కళాశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు తోడ్పాటు, పలాసలో డయాలసిస్ యూనిట్ల నిర్వహణ, జిల్లాలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం వంటి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment