ఫొటోలు తీసి.. మార్ఫింగ్ చేసి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో ఒళ్లు గగుర్పాటు కలిగించే విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థినితో చనువు పెంచుకున్న ఓ యువకుడు ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఏకంగా పోర్న్ వెబ్‌సైట్‌లో పెట్టిన అకృత్యాన్ని పోలీసులు పసిగట్టారు. మరొక యువకుడు ఇలాగే మార్ఫింగ్ వీడియోలను టెలిగ్రామ్‌లో షేర్ చేసి సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. విద్యార్థిని ఈ నెల 11న రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..
విద్యార్థినికి తెలియకుండానే..
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన షేక్ మహ్మద్ సోయెల్‌కు జిల్లాలో చదువుతున్న విద్యార్థినితో పరిచయం ఉంది. ఆ విద్యార్థినితో చనువుగా ఉంటూ ఆమెకు తెలియకుండానే ఆమె చిత్రాలను, వీడియోలను తీసేవాడు. కొన్నాళ్లకు ఆమె వీడి యోలను, ఫొటోలను న్యూడ్‌గా మార్ఫింగ్ చేశా డు. తెలియని నంబర్ నుంచి ఆమె వాట్సాప్‌కు ఫొటోలను, వీడియోలను పంపుతూ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.
ధైర్యంగా ఫిర్యాదు చేసి..
ఇలా ఎవరు చేస్తున్నారో తెలియని విద్యార్థిని మొ దట్లో తీవ్ర వేదన అనుభవించింది. తల్లిదండ్రులకు, పోలీసులకు చెబితే పరువు పోతుందని మొ దట్లో భావించింది. కానీ ధైర్యం చేసి ఈ నెల 11న రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఈశ్వరరావు విచారణ ఆరంభించి పరిచయస్తుల పనే అని భావించి తిరుపతికి చెందిన షేక్ మహ్మద్ సోయెల్ అని తెలుసుకుని నాలుగు రోజుల కిందట తిరుపతిలో ఉంటున్న అతనికి నోటీసులు పంపారు.
మరో దొంగ..
సోయల్‌ను విచారించడం, ఆయన ఫోన్‌ను క్షు ణ్ణంగా పరిశీలించడంతో విద్యార్థిని ఫొటోలు, వీ డియోలు వెబ్‌పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేయడం చూశారు. అవే చిత్రాలు, వీడియోలు ఇన్‌స్టాగ్రా మ్, టెలిగ్రామ్‌ల్లో సైతం ఎలా అప్‌లోడ్ అయ్యా యన్నది అర్థం కాక జిల్లా సైబర్ సెల్ బృందాన్ని రంగంలోకి దింపారు. వారు ఇన్‌స్టా, టెలిగ్రామ్ యాజమాన్యాలకు మెయిల్‌లో ఫిర్యాదు పంపగా అటునుంచి వారు ఐడీలు, ఫోన్ నంబర్ పంపించారు. అవి కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఉప్పుగళ్ల రఘువిగా గుర్తించి అతనికి నో టీసులు పంపారు. గురువారం రఘు స్టేషన్‌కు రాగా విచారించారు.
ఒప్పుకున్నాడు..
పోర్న్‌సైట్‌లో వచ్చిన వీడియోలను అప్‌లోడ్ చేసు కుని ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లలో పెట్టింది తానేనని, ఒకసారి లింక్ చేసే ముందు తనకు రూ. 200లు పంపించాలని చెప్పడంతో చాలామంది తనకు డబ్బు పంపారని రఘు చెప్పారు. విస్తుపోయే నిజాలు తెలియడంతో సీఐ ఈశ్వరరావు గురువారం రాత్రి ఇరువురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మార్ఫింగ్ వీడియోలను పోర్న్ సైట్‌లో పెట్టిన యువకుడు
టెలిగ్రామ్‌లో వీడియోలు పెట్టి డబ్బులు చేసుకున్న మరో యువకుడు
వివరాలు వెల్లడించిన సీఐ పి.ఈశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment