మూఢ నమ్మకం
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
జడలు విప్పిన
● నవజాత శిశువు పొట్టపై 40 చురకలు
కొరాపుట్:
మనిషి అధునాతన టెక్నాలజీతో వేరే గ్రహాల మీదకు వెళ్లిపోతున్నాడు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాడు. ఇలాంటి కాలంలోనూ ఇంకా ఒడిశాలో మూఢ నమ్మకాల జాడలు కనిపిస్తున్నాయి. గిరిజనుల మూఢ నమ్మకం ఓ నవజాత శిశువు ప్రాణం మీదకు తెచ్చింది. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ ప్రభుత్వ ఆస్పత్రికి గిరిజనులు ఒక నవజాత మగ శిశువుని తీసుకుని వచ్చారు. అనారోగ్యంతో ఉన్న ఆ శిశువును వైద్యులు పరిశీలించగా పొట్ట మీద కొడవలితో 40 చురకలు వేసిన గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులు చూసిన వెంటనే డాక్టర్లు అదిరి పడ్డారు. వెంటనే జిల్లా కేంద్రాస్పత్రి ముఖ్య అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం ఇంత లోనే దావానలంగా వ్యాపించడంతో ప్రముఖ టీవి చానెళ్లలో ప్రముఖ వార్తగా వైరల్ అయిపోయింది. వెంటనే రాష్ట్ర వైద్య శాఖ రంగంలో దిగి శిశువుని రక్షించడానికి చర్యలు చేపట్టింది. జిల్లాలో చందాహండి సమితి గంబారి గుడ గ్రామ పంచాయతీ పండేల్ పాడ గ్రామానికి చెందిన సరోజ్ కుమార్ నాయక్ అనే గిరిజనుడికి మగ శిశువు జన్మించాడు. కుమారుడి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ గ్రామ సమీపంలో మంత్రగత్తెను అతడు ఆశ్రయించాడు. ఆమె శిశువు పొట్ట మీద కొడవలిని కాల్చి వాతలు పెడితే ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి అలాగే చేసింది. కానీ ఆ వాతలు చీము పట్టి ఆ బిడ్డ నరకయాతన అనుభవించాడు. చివరకు విధి లేక ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా విషయం వెలుగులోకి వచ్చింది. నబరంగ్‌పూర్ జిల్లా ముఖ్య వైద్యాధికారి సంతోష్ కుమార్ పండా మాట్లాడుతూ ప్రస్తుతం తాము నాణ్యమైన వైద్యం అందిస్తున్నామన్నారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గ్రామీణ స్థాయిలో గిరిజనులకు మూఢ నమ్మకాలను వదిలించడానికి మరింతగా అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు. మరో వైపు ఈ విషయం పై మహిళా హక్కుల ఉద్యమ కర్త కాధంభని త్రిపాఠి మండి పడ్డారు. ఈ మూఢాచారం నిర్మూలన కోసం తాము చందాహండి,జొరిగాం సమితులలో అవగాహన ర్యాలీలు నిర్వహించామన్నారు. ఇలా వాతలు పెట్టిన మంత్రగత్తెలను అరెస్ట్ చేస్తే గాని సమస్య అదుపులోనికి రాదని కాధంబని పేర్కొన్నారు.
న్యూస్‌రీల్
మూఢ నమ్మకం
మూఢ నమ్మకం
మూఢ నమ్మకం
మూఢ నమ్మకం
మూఢ నమ్మకం
Comments
Please login to add a commentAdd a comment