విస్తృత ప్రచారం కల్పించాలి
జయపురం: విశ్వ వ్యవసాయ చారిత్రిక స్థలంగా గుర్తింపు పొందిన కొరాపుట్‌పై విస్తృత ప్రచారం చేసేందుకు అధికారులు సమాయత్తమం కావాలని రాష్ట్ర వ్యవసాయ విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద పాడీ అన్నారు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు కొరాపుట్ సంస్కృతి, వ్యవసాయ ప్రణాళిక, వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తికి, బ్రాండిగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఎర్పాటు చేసిన విషయ సూచన ఫలకాలను జిల్లాలో 8 చోట్ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జయపురం విమానాశ్రయంలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద పాడీ విశ్వ వ్యవసాయక చారిత్రిక స్థలంగా గుర్తింపు ఫలకాన్ని ప్రారంభించారు. విశ్వంలోనే ప్రథమ వ్యవసాయ స్థలం కొరాపుట్‌కు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. జయపురం దసరా పొడియ మైదానంలో నిర్వహిస్తున్న వ్యవసాయ యంత్ర మేళా సందర్భంగా జయపురం వచ్చిన డాక్టర్ పాడీ వివిధ ప్రభుత్వ అధికారులతో ప్రపంచంలో వ్యవసాయం పుట్టినిల్లు చారిత్రిక స్థలం అయిన కొరాపుట్ జిల్లాపై సుధీర్ఘంగా చర్చించారు. నేటివరకు ఈ విషయం ప్రచారం కాకపోవటం విచారకరమన్నారు. కొరాపుట్ పర్వత ప్రాంతం, వ్యవసాయ క్షేత్రం, సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తున పంటలు పండుతున్న ప్రాంతంలో ఆదివాసీ సంస్కృతి, జన సంఖ్య, అటవీ ఉత్పత్తులు, దేశీ విత్తనాల సంరక్షణ, జైవిక పద్ధతిలో పంటల పండించటం,సేఫ్టీ కల్టివేషన్, ప్రకృతి జల వినియోగం, తదితర విషయాలపై అధికారులతో చర్చించారు. జిల్లాలో పండుతున్న ధాన్యం, కొలాజీర ధాన్యం (నల్ల ధాన్యం), రాగులు, ఊదలు, గంటెలు, జొన్నలు, ఓలిసి, మొక్కజొన్న, కాయగూరలు, బంగాళదుంపలు, కాఫీ, మిరియాలు, పప్పు ధాన్యాలు, తదితర పంటలపై పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలన్నారు. జయపురం సబ్‌కలెక్టర్ ఎ.శొశ్యరెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్ కమేండర్ అబకిశ పొరిడ, జిల్లా వ్యవసాయ అధికారి గోకుల చంద్ర ప్రదాన్, ఉద్యాన వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ సుధమ చరణ బిశ్వాల్, వ్యవసాయ విభాగ అదనపు డైరెక్టర్ కన్హూచరణ దాస్, కుంద్ర బ్లాక్ వ్యవసాయ అధికారి తాపస చంఽద్రదాస్, ఎం.ఎస్.స్వామినాథన్ రిసేర్చ్ ఫౌండేషన్ సైంటిస్ట్ డాక్టర్ కార్తీయ లుంక పాల్గున్నారు.
Comments
Please login to add a commentAdd a comment