సత్యసాయి సమితి ఔదార్యం
● నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మాణం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సమితి పరిధి కొత్తురు గ్రామంలో నిరుపేద కుటుంబమైన కొపులి రోజాకు సత్యసాయి సమితి ఇల్లు నిర్మించి తన సేవా భావాన్ని చాటుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన బీజేడీ నాయకుడు ఏకే పాండ్యిన్ రోజా కుటుంబ కష్టాలను విని 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తమిళనాడుకు చెందిన రోజా వివాహం అనంతరం కొత్తూరులో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. అయితే గత రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త మరణించడంతో కష్టంగా కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. పాడుపడిన ఇంటిలో నివాసం ఉంటుంది. ఉండడానికి సరైన ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న వీరి కష్టాలను చూసిన గుణుపూర్‌లోని సత్యసాయి సేవా సమితికి చెందిన సభ్యులు నిధులను సమకూర్చి ఇంటిని నిర్మించి రోజాకు ఇచ్చి ఆదర్శంగా నిలిచారు.
సత్యసాయి సమితి ఔదార్యం
Comments
Please login to add a commentAdd a comment