ఖుర్దా రోడ్ డివిజన్ ఘనత
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం సరుకు రవాణాలో తనదైన సత్తాని చాటుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రోజుకు సగటున 130.5 ర్యాకుల సరుకు లోడ్ చేసి సరికొత్త రికార్డు నెలకొలిపింది. గత ఏడాది మార్చి నెలలో అత్యధికంగా దినసరి సరుకు లోడు 128.1 ర్యాకులకు పరిమితం కాగా ఈ ఏడాది 130.5 ర్యాకుల లోడుతో పాత రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1 నుండి 28వ తేదీ వరకు మండల వ్యాప్తంగా వివిధ లోడింగ్ పాయింట్‌ల నుంచి సమగ్రంగా 3 వేల 655 ర్యాక్‌ల్లో సరుకు లోడు చేయడం విశేషంగా పేర్కొన్నారు. పారాదీప్ ప్రాంతంలో అత్యధిక దినసరి సరుకు లోడింగు నమోదైంది. ఈ ప్రాంతం దినసరి సరుకు లోడింగు 29.1 ర్యాకులుగా నిలిచింది. ఉక్కు కర్మాగారాలకు బొగ్గు, ఇనుప ఖనిజం వంటి ముడి పదార్థాలు, ఎరువులు, సిమెంట్, ఆహార ధాన్యాలు మొదలైనవి నిత్యం రవాణా చేస్తారు. ఈ సందర్భంగా స్థానిక మండల రైల్వే అధికారి డీఆర్‌ఎం హెచ్‌ఎస్ బజ్వా అనుబంధ అధికార, సిబ్బంది యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment