అపహాస్యం.. ఆగ్రహం
భువనేశ్వర్: ఒక విదేశీ మహిళ తన తొడపై శ్రీ జగన్నాథుడి బొమ్మను పచ్చ బొట్టుగా పొడిపించుకోవడం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇది అపవిత్రమైన చర్య అని పేర్కొంటూ హిందూ సేన స్థానిక సాహిద్ నగర్ ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘట్టం సాంఘిక మాధ్యమంలో విస్తృతంగా ప్రసారం కావడంతో మరింత అలజడి రేగింది. నగరంలో ఒక టాటూ పార్లర్‌లో విదేశీ మహిళ తన తొడపై పొడిపించుకున్న జగన్నాథుడి పచ్చ బొట్టును బహిరంగంగా ప్రదర్శించడం సాంఘిక మాధ్యమంలో ప్రసారమైంది. స్వామి భక్త జనం ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో వివాదానికి దారితీసింది. ఆ మహిళ తొడపై అత్యంత గౌరవనీయమైన దేవత యొక్క పచ్చబొట్టు స్థానిక మత విశ్వాసాలను అగౌరవ పరిచేదిగా పరిగణించి చర్యలు చేపట్టాలని భక్త జనం పట్టుబడుతున్నారు.
గ్రామంలోకి చొరబడిన జింక
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి అటవీ రేంజ్ పరిధిలో గల బంకాంబ పంచాయతీకి చెందిన ఉపొరొకొడింగా గ్రామంలోకి జింక చొరబడింది. దీనిని గ్రామస్తులు పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింక గర్భంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే చికిత్స చేయించి ఆరోగ్యంగా ఉండటంతో సొమవారం అడవులోకి విడిచిపెట్టారు.
మాజీ వార్డు మెంబర్ దారుణ హత్య
పర్లాకిమిడి: పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దారి కాసి మాజీ వార్డు మెంబర్ ముఠా మఝి (40)ని కొరడాగడి గ్రామం వద్ద హత్య చేసి మోటారుబైక్‌కు కట్టి ఈడ్చుకువెళ్లి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటామా రోడ్డు పక్కన పడేశారు. అడవ పంచాయితీ కటమా వద్ద సోమవారం సంచనలంగా మారింది. ఈ సంఘటన అనంతరం మృతుని బంధువులు, నువాబడి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి హత్య చేసిన అగంతకులను పోలీసులు వెంటనే అరెస్టు చేయలని డిమాండు చేశారు. వివరాలు ఇలా వున్నాయి. జిల్లాలో మోహనా నియోజకవర్గం అడవ పంచాయతీ కటమా గ్రామం నువాబడి వద్ద మాజీ వార్డు సభ్యుడు ముఠా మఝి పానిగండ నుంచి ఆదివారం తిరిగి వస్తుండగా కొందరు ప్రత్యర్థులు దారి కాసి కొట్టి బైక్ వెనక్కి కట్టి ఈడ్చుకుని వెళ్లి కటమా రోడ్డు పక్కన పడేశారు. సోమవారం ఉదయం మృతుని సోదరుడు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించాడు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. హత్యకేసులో ముఠా మఝి సాక్షిగా ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కేసును అడవ పోలీసు ఐఐసీ సుభ్రాంత పండా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకూ నిందితులు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు.
అపహాస్యం.. ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment