
బాలికపై అత్యాచారం కేసులో ఫారెస్టర్ అరెస్టు
రాయగడ: బాలికపై అత్యాచారం కేసులో ఫారెస్టర్‌ను గుడారి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. జిల్లాలోని గుడారి అటవీ రేంజ్ పరిధిలో గల కెందుగుడ అటవీ సెక్షన్‌లో ఫారెస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నరసింహ శతపతిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కెందుగుడలో ఉంటున్న ఫారెస్టర్ నరసింహ ఇంటి పొరుగున ఉన్న 12 ఏళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అతని ఇంటి లోపలకు తీసుకువెళ్లాడు. అదే సమయంలో బాలికతో సహా ఉంటున్న మరో బాలిక ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేసింది. దీంతో నరసింహ ఉంటున్న నివాసంలొకి వెళ్లిన కుటుంబీకులు మైనర్ బాలికను ఇంటికి తీసుకువచ్చి అతడిని కుటుంబీకులతొ పాటు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బాధిత కుటుంబం గుడారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు ఫారెస్టర్‌ను అరెస్టు చేశారు.
విద్యార్థి మృతి
భువనేశ్వర్: స్థానిక ఉత్కళ విశ్వ విద్యాలయం హాస్టల్‌లో విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. మృతుడు క్యాంపస్‌లో మధుసూదన్ హాస్టల్‌లో ఉంటున్నట్లుగా గుర్తించారు. తత్వశాస్త్ర విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి మృతికి కారణాలు తెలియరాలేదు.
385 కేజీల గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాదింబ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 385 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు బృందంగా ఏర్పడి శనివారం సాయంత్రం దాడులను నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన కొంతమంది గంజాయి బస్తాలను విడిచి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5 లక్షల ఉంటుందని అంచనా వేశారు.

బాలికపై అత్యాచారం కేసులో ఫారెస్టర్ అరెస్టు

బాలికపై అత్యాచారం కేసులో ఫారెస్టర్ అరెస్టు