జయపురం: జయపురం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అశోక్ దాస్ ఎన్నిక్యయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి దాసరథి పట్నాయక్ శని వారం రాత్రి వెల్లడించారు. శనివారం ఎన్నికలు జరిగిన తరువాత సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి ఒట్ల లెక్కిపుపూర్తయిన తరువాత ఫలితాలను వెల్లడించారు. 587 మంది ఓటర్లు గల అసోసియేషన్‌లో 497 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరోజ్ కుమార్‌దాస్‌కు 269 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి త్రినాత్ సింగ్‌లాల్‌కు 172, అజయ కుమార్ సాహుకు 52 ఓట్లు వచ్చాయి. అలాగే కార్యదర్శి పదవికి పోటీ చేసిన సచ్చిదానంద మిశ్ర 308 ఓట్లు పొంది విజయం సాధించగా ప్రత్యర్ధి శరత్ కుమార్ మఝికి 187 ఓట్లు వచ్చాయి. జాయింట్ కార్యదర్శిగా భోలానాద్ పట్నాయక్ ,సహాయ కార్యదర్శిగా అంజనసింగ్ ఏకగ్రీవగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నవీణ చంద్రసాహు, కోశాధికారిగా శైలేష్ కుమార్ మదల, గ్రంథాలయ కార్యదర్శిగా జుగల్ కిశోర్ పట్నాయక్, గ్రంథాలయసహాయ కార్యదర్శిగా రాఖి భాయి, కార్యవర్గ సభ్యులుగా ఆకాశ్ కులదీప్, పొన్నగంటి శంకరరావు, సచిన్ కుమర్ పాఢి, సురేష్ కుమార్ సెట్టి, తాపస్ పండ, తరణి పాణిగ్రహి, విశ్వనాథ్ ఆచారి ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకునిగా రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యలు పిట్టా రమేష్ పాత్రో వ్యవహరించారు. ఫలితాలు అనంతరం పట్టణంలో ర్యాలీ చేశారు.
జయపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సరోజ్‌దాస్
జయపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సరోజ్‌దాస్
జయపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సరోజ్‌దాస్
జయపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సరోజ్‌దాస్