
20 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం:జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి కుంద్ర గ్రామంలోగల సరస్వతీ శిశు విద్యాలయంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. శిశు మందిర విద్యాలయ రజిత్ జయంతి సందర్భంగా అమొఒడిశా, సంబాద్‌ల సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కొరాపుట్ కేంద్ర విద్యాలయ అధ్యాపకులు సీతారాం రాయగురు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. శిబిరంలో డాక్టర్ హరిశ్చంధ్ర ప్రధాన్, జయపురం రక్త భంఢార్ టెక్నీషియన్‌లు హేమాంగ, నతనీల దానీ,ప్రమోద్ ఖిలో, హరిశ్రంధ్ర ప్రధాన్‌లు దాతల నుంచి 20 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా విద్యాలయ పరిచాలన కమిటీ భగవాన్ మల్లిక్, కార్యదర్శి అజిత్ కుమార్ సాహు, సహాయ కార్యదర్శి బికాశ్ చౌధురి, కోశాధికారి సుమిత్ కుమార్ సాహు, సమితి ఆర్.ఎస్.ఎస్ ప్రతినిధి వి.గిరి రావు, ఆచార్య స్వరూప్ కుమార్ దాస్, మాజీ కార్యదర్శి కృష్ణచంద్ర పాత్రో, సుజిత్ కుమార్ సాహు, జితేంధ్ర ఖుండ్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్న అతిథులు

20 యూనిట్ల రక్తం సేకరణ