
పాఠశాలల్లో ప్రవేశాలకు శ్రీకారం
రాయగడ: విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకునే ప్రక్రియలో భాగంగా నూతన ప్రవేశాలకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లా కలక్టర్ ఫరూల్ పట్వారి స్థానిక గొపబంధు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఐదేళ్ల చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా పలక, బలపం అందజేసి చిన్నారులను ఆమె ఆశీర్వదించారు. మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిహారిక బిడిక, జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాయక్, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్‌లాల్ మాఝి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణం నుంచి చైతన్య రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. సెప్టెంబర్ నెల చివరి వరకు ఈ ప్రచార, ప్రవేశ ఉత్సవాలు కొనసాగుతాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.

పాఠశాలల్లో ప్రవేశాలకు శ్రీకారం