విభిన్న ప్రతిభావంతుల క్రీడాశిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతుల క్రీడాశిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Apr 4 2025 12:37 AM | Last Updated on Fri, Apr 4 2025 12:37 AM

విభిన్న ప్రతిభావంతుల క్రీడాశిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

విభిన్న ప్రతిభావంతుల క్రీడాశిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురం టౌన్‌: విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆరు వారాల పాటు క్రీడాశిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక డీఎస్‌డీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ రాష్ట్రంలోని పాటియాలలో 2025వ సంవత్సరానికి విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆరు వారాల పాటు ఇవ్వనున్న శిక్షణ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాఽధించి 20 నుంచి 42ఏళ్ల మధ్య వయస్సు గల వారు అర్హులన్నారు. మినిమం 1,2,3 పొజిషన్‌లో అంతర స్కూల్‌, కళాశాల, యూనివర్సిటీ క్రీడాపోటీలు, సంబంధిత క్రీడాసంఘాలు నిర్వహించే క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు అర్హులని స్పష్టం చేశారు. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, సైక్లింగ్‌, క్రికెట్‌, ఫెన్సింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, జుడో, కబడ్డీ, ఖోఖో, రోల్‌బాల్‌, రోలింగ్‌, సాఫ్ట్‌బాల్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, తైక్వాండో, టేబుల్‌ టెన్నిస్‌, లాన్‌టెన్నిస్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, యోగాసనాల వంటి క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. దరఖాస్తులను హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.6డబ్ల్యూసీసీ.ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌.ఐఎన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ 14వ తేదీలోగా చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 8712622564, 9866805716 నంబర్లను సంప్రదించాలని కోరారు.

పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల తనిఖీ

విజయనగరం క్రైమ్‌: స్థానిక కంటోన్మెంట్‌లో ఉన్న పోలీస్‌ శిక్షణ కళాశాలను విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామభద్రపురం వెళ్తున్న డీఐజీ ముందుగా నగరంలోని పోలీస్‌ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న శిక్షణ కళాశాలను విజిట్‌ చేశారు. కళాశాలలో గ్రైండ్‌ బ్యారెక్‌, డైనింగ్‌ హాల్‌, అడ్మిన్‌ బ్లాక్‌, లైబ్రరినీ పరిశీలించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌ రామచంద్రరాజు శిక్షణార్థులకు ఇస్తున్న శిక్షణను డీఐజీకి తెలియజేశారు. తరగతుల్లో ఎన్డీపీఎస్‌, పోక్సో, సైబర్‌ క్రైమ్‌, సోషల్‌ మీడియా, క్రిమినల్‌ లా వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ వివరించారు. కానిస్టేబుల్స్‌కు అత్యుత్తమమైన శిక్షణ ఇవ్వాలని పీటీసీ ప్రిన్సిపాల్‌, ఫ్యాకల్టీకి డీఐజీ గోపీనాథ్‌ జెట్టి సూచించారు. అంతకు ముందు పీటీసీకి వచ్చిన డీఐజీకి ఎస్పీ వకుల్‌ జిందల్‌ స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ పీవీ అప్పారావు, డీఎస్పీలు, శ్రీకాంత్‌, రమేష్‌, భవానిలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రం పరిశీలన

విజయనగరం క్రైమ్‌: నగర శివారు సారిపల్లిలో ఉన్న జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి పరిశీలించారు. విజయనగరం వచ్చిన డీఐజీ, ఎస్పీ వకుల్‌ జిందల్‌, ఏఎస్పీ సౌమ్యలతతో కలిసి డీటీసీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కానిస్టేబుల్స్‌ నియామకాలు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో డీటీసీని డీఐజీ పరిశీలించారు.ఈ సందర్భంగా శిక్షణ కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తామని రేంజ్‌ డీఐజీ చెప్పారు. కేంద్రంలో ఉన్న గదులు, మంచాలు, పరుపులు, క్రీడా సామగ్రి, ఆఫీస్‌ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో డీటీీసీ డీఎస్పీ వీరకుమార్‌, భోగాపురం రూరల్‌ సీఐ రామకృష్ణ, సీఐ లలిత, ఆర్‌ఐ గోపాలనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement