చూసిన కనులదే భాగ్యము
అమరావతి: మహాశివరాత్రి ఉత్సవాలలో అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్య రథోత్సవం గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. అమరావతి, ధరణికోట గ్రామాలకు చెందిన చింకా, ఆలపాటి, కోనూరు వారి వంశస్తులు తమ గుర్రాలకు రంగులు వేసి ఊరేగింపుగా తెచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ గుర్రాలను రథంపై ముందు భాగంలో అలంకరించారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉభయదేవేరులతో కూడిన అమరేశ్వరుడిని గాలిగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు. స్వామి వారి దివ్యరథానికి ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ పర్యవేక్షణలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, వాస్తు మండపారాధన, రథాంగ హోమం, రథ సంప్రోక్షణ, రథబలి కార్యక్రమాలను నిర్వహించి అష్టదిక్పాలకులు శాంతి కోసం కుంభంపోసి దీపారాధన చేయటంతో రథోత్సవం ప్రారంభ క్రతువును పూర్తి చేశారు.
సర్వాంగ సుందరం..
వివిధ రకాల, రంగురంగుల పూలతో సర్వాంగసుందరంగా అందంగా అలంకరించిన దివ్యరథంపై ఉభయదేవేరులతో కూడి న అమరేశ్వరుని కొలువుదీర్చారు. స్వామి వారి రథోత్సవాన్ని సుమారు నాలుగున్నర గంటలకు ప్రారంభించారు. ఆలయ గాలిగోపురం వద్ద నుంచి ప్రారంభమైన రథోత్సవం వేలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని గాంధీబొమ్మ సెంటర్ వరకు అక్కడ నుంచి వెనుదిరిగి శివనామస్మరణ చేస్తూ రథశాలలోకి చేర్చారు. మండల పరిధి గ్రామాల నుంచే కాక ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో అమరావతి భక్తజన సంద్రమైంది.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
ఈ కల్యాణోత్సవానికి ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాసరచయిత పీసపాటి నాగేశ్వరశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కల్యాణోత్సవంలో ఆలయ అనువంశిక ధర్మకర్త, పాలక మండలి చైర్మన్ రాజావాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు.
కీలు గుర్రంపై..
బాలచాముండికా సమేత అమరేశ్వరుడికి గురువారం రాత్రి కీలుగుర్రంపై గ్రామోత్సవం నిర్వహించారు. తొలుత అమరేశ్వరాలయం నుంచి గాంధీబొమ్మ సెంటరు వరకు ఈఉత్సవాన్ని నిర్వహించారు. బాలచాముండేశ్వరిదేవితో అమరేశ్వరుడు కీలుగుర్రంపై ఎక్కి నాలుగుదిక్కులు తిరుగుతూ ఉంటే భక్తజనం ఆసక్తితో తిలకించారు.
ఘనంగా కల్యాణోత్సవం
వైభవంగా గ్రామోత్సవం
కల్యాణ మహోత్సవం అనంతరం గురువారం ఉదయం నంది, చిలుక, చిన్నరథంపై స్వామివారిని వైభవోపేతంగా ఊరేగింపు నిర్వహించారు. తొలుత కల్యాణ వేదికపై నుంచి అమ్మవార్లను, స్వామివారిని వాహనాలపై అలంకరించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.
వైభవంగా అమరేశ్వరుని దివ్య రథోత్సవం
ఉభయ దేవేరులతో
ఊరేగిన అమరేశ్వరుడు
శివపంచాక్షరి నామంతో
మార్మోగిన అమరారామం
భక్తజన సంద్రంగా అమరావతి
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరారామ క్షేత్రంలో వేంచేసియున్న శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘశుద్ధ చతుర్ధశి నాడు ప్రధానమైన కల్యాణోత్సవం నిర్వహించారు. తొలుత బుధవారం రాత్రి స్వామివారికి లింగోద్భవకాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుధ్రాభిషేకం, రాత్రి రెండుగంటలకు స్వామివారికి, అమ్మవారికి ఎదుర్కోల మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవంలో విఘ్నేశ్వర పూజ, కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాల క్రతువులను శాస్త్రోక్తంగా జరిపించారు.
చూసిన కనులదే భాగ్యము
చూసిన కనులదే భాగ్యము
Comments
Please login to add a commentAdd a comment