త్రికోటేశ్వరుని తిరునాళ్ల ఆదాయం రూ. 1.77 కోట్లు
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి రూ.1,77,68,172 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. ఆలయ హుండీ కానుకల లెక్కింపు గురువారం నిర్వహించారు. కానుకల ద్వారా రూ.73,47,918, పూజా టికెట్లు విక్రయం ద్వారా రూ.65,01,070, ప్రసాదాల ద్వారా రూ.38,17,395, అన్నదానం, ఇతర సేవలు, స్కీములకు రూ.1,01,789 లభించినట్టు వివరించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది రూ.14.19లక్షల అదనంగా వచ్చినట్టు పేర్కొన్నారు. దేవదాయశాఖ డిప్యూటి కమిషనర్ చంద్రకుమార్, ఉప కమిషనర్ కేబీ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శ్రీధర్‌రెడ్డి, సుధాకర్‌లు పర్యవేక్షించారు. యల్లమంద చైతన్య గోదావరి బ్యాంక్, దేవదాయ, ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు.
వైభవంగా లింగోద్భవ పూజలు
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి లింగోద్భవ పూజలు వైభవంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి 12గంటల నుంచి ప్రారంభమైన పూజలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. పంచామృత ఫలరసాలు, సుగంధద్రవ్యాలతో మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాన్ని కనుల పండుగ్గా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రకుమార్‌లు అభిషేకాల్లో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో లింగోద్భవ పూజలను తిలకించారు. ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
‘క్వారీ’ తిరునాళ్ల ఆదాయం రూ.16.37 లక్షలు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం తిరునాళ్ల ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు దేవదాయశాఖాధికారులు తెలిపారు. దేవస్థానం వద్ద గురువారం దేవదాయశాఖాధికారులు హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమంను నిర్వహించారు. హుండీ కానుకల ద్వారా రూ.6,72,636, అభిషేకం, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.6,76,195, వివిధ రకాల వేలం ద్వారా 2,88,800 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. దేవస్థానానికి మొత్తంగా రూ.16,37,631లు ఆదాయం సమకూరిందని దేవదాయశాఖాధికారి పోతుల రామకోటేశ్వరరావు తెలిపారు. గత ఏడాది రూ.14,00,692 ఆదాయం రాగా గత ఏడాది కన్నా ఈ దఫా రూ.2,36,939 అదనపు ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
నందివాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా స్వామి కల్యాణ మహోత్సవం అనంతరం గురువారం ఉదయం స్వామివారు నందివాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్గించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ఈఓ జేవీ నారాయణ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. గ్రామోత్సంలో గంగా భ్రమరాంబ సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధుల్లో విహరించారు.
యార్డులో 1,03,526 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 99,747 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,03,526 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,500 వరకు పలికింది.
త్రికోటేశ్వరుని తిరునాళ్ల ఆదాయం రూ. 1.77 కోట్లు
త్రికోటేశ్వరుని తిరునాళ్ల ఆదాయం రూ. 1.77 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment