ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు... | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు...

Published Fri, Feb 28 2025 1:58 AM | Last Updated on Fri, Feb 28 2025 1:57 AM

 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు...

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు...

విద్యావంతులు, ఉన్నత ఆలోచనలు కలిగిన వారిని చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శాసనమండలి ఎన్నికలను టీడీపీ అపహాస్యం చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను ఏజెంట్లగా కూర్చొబెట్టి దొంగ ఓట్లు వేయించుకున్నారు. ఓటమి భయంతోనే కూటమి నేతలు ఈ కుట్రలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఓటర్ల జాబితా కూడా తప్పుల తడకగా అధికారులు తయారు చేశారు. ఓటర్ల జాబితాలో డబుల్‌ ఎంట్రీ ఓట్లు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ఎన్నికల సంఘం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి.

– గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement