ముగిసిన విశిష్ట గుర్తింపు నమోదు గడువు
అచ్చంపేట: సొంత భూములు కలిగిన రైతులంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే రాయితీలను పొందాలన్నా, పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా తప్పనిసరిగా 14 అంకెలుగల విశిష్ట గుర్తింపు సంఖ్యను (యునిక్‌ఐడి నెంబరును) కలిగి ఉండాలి. గుర్తింపు సంఖ్య నమోదుకు తుది గడువు శుక్రవారంతో ముగిసింది. మండలంలోని చామర్రు రెవెన్యూ కింద 1200 మంది, కోగంటివారిపాలెం గ్రామానికి చెందిన మరో 500 మందికి రైతులు ఒక్కరూ కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేకపోయారు. గడువు ముగియడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం కూడా ఓ కారణం.
మొరాయిస్తున్న ఆన్‌లైన్ సేవలు
రైతు సేవా కేంద్రాలలో ఆన్‌లైన్ సేవలు మొరాయిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు 7697 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు సగం మంది రైతుల పేర్లు కూడా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. వారికి 14 అంకెల యూనిక్ ఐడీ నెంబరు కేటాయించలేదు. ముఖ్యంగా మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉండగా చామర్రు రెవెన్యూ కింద 1200, కోగంటివారిపాలెం కింద 500మంది రైతులు ఉన్నారు. ఒక్కరి భూమి కూడా ఆన్‌లైన్ కాలేదు. వ్యవసాయశాఖ సూచించిన విధంగా రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్‌కు లింకై న ఫోన్ నెంబరుతో రైతు సేవా కేంద్రాలకు వెళ్లినా ఆన్‌లైన్ సేవలు మొరాయిస్తున్నాయే తప్ప నమోదు కావడంలేదు. చివరకు గడువు ముగియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆందోళనలో చామర్రు రైతులు మరికొంత సమయం ఇస్తారంటున్న వ్యవసాయాధికారులు
Comments
Please login to add a commentAdd a comment