పల్నాడుకు తీవ్ర అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని విధాలా వెనుబడిన పల్నాడుకు తీవ్ర అన్యా యం జరిగింది. ఎన్నికల హామీలను పరిగణనలోకి తీసుకోలేదు. పల్నాడు ప్రజలను ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న వరికపూడిశెల విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు గుర్తు రాలేదు. కొత్త జిల్లా అవసరాలు, మౌలిక సదుపాయాల కల్ప న, మూలనపడిన లిఫ్ట్ ఇరిగేషన్లకు మరమ్మ తుల నిధులు, ఉపాధి హామీ పథకం, రైతులకు, కౌలు రైతులకు బడ్జెట్లో ఉపయోగపడే ఊసేలేదు. పరిశ్రమల స్థాపనకు భూము లు ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యంతోనే పల్నా డు వెనుకబడింది. రాజధాని నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో రాజధాని అభివృద్ధి చేయాలి. సూపర్ సిక్స్‌తో ప్రజలను నమ్మించి మోసం చేశారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతులకు పెట్టుబడి సాయానికి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి.
– గుంటూరు విజయ్ కుమార్, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment