డ్రగ్స్ రహిత జిల్లాగా పల్నాడు
నరసరావుపేట: పల్నాడును డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అన్నీ ప్రభుత్వ శాఖలు సమన్వయం, ఉమ్మడి భాగస్వామ్యంతో జిల్లాలో డ్రగ్స్ జాడ్యంపై పోరాటం చేయాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇరువురూ కలిసి బాలలు–మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు నియంత్రణ చర్యలపై పోలీసు, విద్య, ఎకై ్సజ్, సాంఘిక సంక్షేమం, పంచాయతీరాజ్, సమాచార–పౌర సంబంధాలు, మహిళా శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖలు, రైల్వే విభాగానికి సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివిధ శాఖల అధికారులకు వివరించారు. కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ మెడికల్ షాపులు, మద్యం దుకాణాల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. లిక్కర్ షాపులు, బార్లు పాఠశాలలకు దూరంగా తరలించాలన్నారు. విద్యాలయాల్లో క్యాంపస్ క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి కమిటీలు, మీటింగ్‌లు నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసు శాఖ వైపు నుంచి మత్తు పదార్థాల నివారణపై మెరుగైన ప్రచార వీడియోలు రూపొందిస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment