ఏమాత్రం చిత్తశుద్ధి లేదు
బడ్జెట్‌పై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. నామ్‌కే వాస్తేగా కేటాయింపులు చేశారు. సూపర్ సిక్స్ ఊసే లేదు. శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చట్లు ఆడుతున్నారు. కొంతమంది నిద్రపోవటం కన్పించింది. పూర్తిస్థాయి బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకుపైగా ప్రవేశపెట్టినా అందులో పేదల వాటా ఎంత? మైనార్టీలకు ఏం కేటాయించారు? వంటివి స్పష్టంగా చెప్పలేకపోయారు. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవలకు కొన్ని నిధులే కేటాయించారు. అవి ఎవరికి ఇస్తారు? ఎంతమందికి సరిపోతాయి? బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించి ప్రజలకు మంచి చేద్దామనే చిత్తశుద్ధి కనిపించలేదు. అంకెలు చూస్తుంటే రాష్ట్రం దివాళా తీసేలా ఉంది.
–షేక్ కరిముల్లా, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment