గుంటూరు ఎడ్యుకేషన్: పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఏపీ రెసిడెన్షియల్ ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పి.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోస్తాంధ్రలో ముస్లిం, మైనార్టీ బాలుర విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న కళాశాలలో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి ఏప్రిల్ 25న జరగనున్న ఏపీఆర్జేసీ సెట్‌కు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏపీఆర్‌ఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 87126 25073, 96525 69140 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
పొన్నూరు రోడ్డు సంగడిగుంటలోని ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ బాలికల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.బాలాశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో మిగిలిన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఖాళీల భర్తీ కోసం కోసం ఆసక్తి గల విద్యార్థినులు ఈనెల 31లోగా ఏపీఆర్‌ఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయా తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష జరుగుతుందని, వివరాలకు 87126 25039 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment