నరసరావుపేట టౌన్: మూడు చోట్ల బైకుల చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఆర్.ఆశీర్వాదం పాల్ మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గత ఏడాది నవంబర్ 19న నరసరావుపేట జీబీఆర్ వైద్యశాల వద్ద బైకు చోరీ కావడంతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు రామిరెడ్డిపేటకు చెందిన షేక్ మహబూబ్ సుభాని ఇంటివద్ద, గీతామందిర్ వద్ద కంభంపాటి వెంకట చలమయ్యకు చెందిన బైకు చోరీ అయ్యాయి. పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితుడు నాదెండ్ల మండలం కనపర్తి గ్రామానికి చెందిన బాల యేసుగా గుర్తించారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. దీంతో పైవిధంగా కోర్టు తీర్పు వెలువరించింది. ఏక కాలంలో మూడు కేసుల్లో ఏడాది శిక్ష అనుభవించేలా తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment