క్రీడలతో మానసిక ఉల్లాసం
ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు
గుంటూరు మెడికల్: ఉద్యోగులు ఒత్తిడితో నిత్యం సతమతమవుతున్న మహిళలకు క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తోందని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని ఏపీ ఎన్జీవో హోంలో మహిళ ఉద్యోగులకు క్రీడాపోటీలు ప్రారంభించారు. క్రీడా పోటీలను ఘంటసాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మహిళలు ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క కుటుంబ బాధ్యతలతో బాగా బిజీగా ఉంటారన్నారు. అలాంటివారికి ఆటవిడుపుగా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. 200 మంది మహిళ ఉద్యోగులు పోటీల్లో పాల్గొన్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళ విభాగం జిల్లా చైర్మన్ రాధారాణి అన్నారు. క్రీడల్లో పాల్గొన్న మహిళ ఉద్యోగులకు రెండు రోజులపాటు కలెక్టర్ సెలవు ప్రకటించారని బుధవారం కూడా క్రీడా పోటీలు జరుగుతాయని జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్యామ్‌సుందర శ్రీనివాస్, రాజశేఖర్, వెంకటరెడ్డి, సుకుమార్, శ్రీధర్‌రెడ్డి, సయ్యద్‌జానీబాషా, సూరి, కళ్యాణ్‌కుమార్, నాగేశ్వరరావు, మరీలు, కన్వీనర్ లక్ష్మీరమ్య, జాయింట్‌సెక్రటరీ శివజ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment