రెడ్‌బుక్ పోలీసింగ్ అమలు
పల్నాడు జిల్లాలో ఇటీవలికాలంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసుల దాష్టీకం విపరీతంగా పెరిగింది. పచ్చ నేతల ప్రోద్బలంతో కొందరు.. కూటమి నేతల మెప్పు పొందేందుకు మరికొందరు ఖాకీలు వైఎస్సార్ సీపీ శ్రేణులపై రెచ్చిపోతున్నారు. తొలుత తప్పుడు కేసులు నమోదు చేయడం.. పోలీసు స్టేషన్‌కు పిలిపించడం.. ఆనక బెదిరించడం.. మాట వినకపోతే చిత్రహింసలకు గురిచేయడం పరిపాటిగా మారింది.
విషయం తెలుసుకున్న దాచేపల్లి మండల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. హనుమంతరావు, చిరంజీవిల అక్రమ నిర్భంధంపై పోలీసులను ప్రశ్నించారు. దాచేపల్లి మండలం నుంచి కాార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్న విషయం పోలీసులు తెలుసుకుని హనుమంతరావు, చిరంజీవిలను స్టేషన్ నుంచి పంపించారు. పోలీసుల దెబ్బలకు గాయపడిన హనుమంతరావు, చిరంజీవిలు గురజాల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందారు. తమను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై కాసు మహేష్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ భాస్కర్, ఎస్‌ఐలు పాపారావు, సౌందర్య రాజన్ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐ, ఎస్‌ఐలపై హైకోర్టులో ప్రైవేటు కేసు వేసేందుకు మహేష్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో వైఎస్సార్ సీపీ శ్రేణులపై పోలీసుల దాడులు పెచ్చరిల్లుతున్నాయని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు. పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి తీవ్ర హింసలకుపాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నించిన కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చితకబాదుతున్నారు.
అసలేం జరిగిందంటే..
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేశానుపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఉల్లేరు హనుమంతరావు, సంక్రాంతి చిరంజీవిలను బుధవారం మధ్యాహ్నం దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టారు. హనుమంతరావు ఇంటివద్ద గత వారం రోజుల క్రితం జరిగిన చిన్న వివాదంపై టీడీపీ నేత ఎం.ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల తరువాత దాచేపల్లి సీఐ భాస్కర్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు హనుమంతరావు, చిరంజీవిలను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌లో హనుమంతరావు, చిరంజీవిలను సీఐ భాస్కర్ తీవ్ర పదజాలంతో దూషించారు. అంతేకాకుండా వీరిద్దరిని పోలీసులు చితకబాదారు. ఈఘటనలో చిరంజీవి వేలికి గాయమైంది. హనుమంతరావు శరీరంపై లాఠీ దెబ్బలు ఉన్నాయి.
ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి చితకబాదిన వైనం సీఐ, ఎస్‌ఐల దాష్టీకంపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కాసు ఆగ్రహం ప్రైవేటు కేసు వేసేందుకు సిద్ధం
ఇదిలా ఉండగా దాచేపల్లి పోలీసుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని హనుమంతరావు, చిరంజీవిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఫిర్యాదు చేస్తే చంపుతానని సీఐ భాస్కర్ బెదిరించారని వాపోయారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment