జనరిక్ ఔషధాల వినియోగంపై అవగాహన కల్పించాలి
జన ఔషధి దివస్‌లో ఎంపీ లావు సూచన
నరసరావుపేట: జనరిక్ మందుల ఔషధాల వినియోగం పెరిగేలా డాక్టర్లు శ్రద్ధ చూపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. శుక్రవారం జన ఔషది దివస్‌ను పురస్కరించుకొని పల్నాడురోడ్డులోని పాత ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రధానమంత్రి జనరిక్ షాపు వద్ద డీఎంహెచ్‌ఓ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన జనరిక్ షాపుల ద్వారా చాలా తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించటం జరుగుతుందని చెప్పారు. డీఎంహెచ్‌ఓ బి.రవి, జిల్లా డ్రగ్ నియంత్రణ అధికారి డాక్టర్ డి.సునీత, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణ అధికారి డాక్టర్ బీవీ రంగారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment