రోడ్డు ప్రమాదంంలో ఏడుగురికి గాయాలు
అమరావతి: మండల పరిధిలోని లేమల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయపడ్డారు. పోలీసుల అందించిన వివరాలు.. లేమల్లెలో జరుగుతున్న గుడారాల పండుగకు గుంటూరు ఏటీ అగ్రహారం నుంచి ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఆటోలో బయదేరి వస్తున్నారు. అలాగే మంగళగిరికి చెందిన కట్టె ప్రకాశరావు స్కూటీపై మంగళగిరి నుంచి గుడారాల పండుగకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వేగంగా వస్తున్న నీళ్ల ట్యాంకర్‌తో కూడిన ట్రాక్టర్ ప్రమాదశాత్తు తొలుత స్కూటీని ఢీకొట్టి, అనంతరం ఆటోని కూడా ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఏడుగురు గాయపడగా అందులో మంగళగిరికి చెందిన కట్టె ప్రకాశరావు, గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన దేవరపల్లి మారుతయ్యలకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స అందించిన మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment