అభయారణ్యానికి రాణి
నల్లమల టైల్‌ఎండ్... నాగార్జునసాగర్– శ్రీశైలం పులుల అభయార్యణం.. పల్నాడు జిల్లాలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతమిది. జిల్లా ఫారెస్ట్ అధికారిగా జి.కృష్ణప్రియ తన విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. కొద్ది నెలల కిందటే డీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంపై పట్టు సాధించారు. పెద్దపులులు జిల్లాలోని దుర్గి, లోయపల్లి, వెల్దుర్తి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాలలోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు, వన్యప్రాణులకు రక్షణ ఇస్తూ సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రతి మహిళను గౌరవించాలి
ప్రతి మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మహిళా సమాజంతో తన గౌరవాన్ని కోరుకుంటుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్‌లో ఒకటైన సమానత్వం వాస్తవ రూపం దాల్చాలి. లింగ వివక్షకు సమాజంలో తావివ్వకూడదు.
–జి.కృష్ణప్రియ, డీఎఫ్‌ఓ, పల్నాడుజిల్లా
Comments
Please login to add a commentAdd a comment