మహిళా సాధికారతకు కృషి
నరసరావుపేట: రాష్ట్రంలో మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాలలో మంత్రి గొట్టిపాటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షత వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో వృద్ధి చెందడం మంచి పరిణామమన్నారు. సీఎం చంద్రబాబు కృషితో మహిళలకు మేలు జరిగిందన్నారు. రాజ్యాంగంలో మహిళలు గౌరవంగా జీవించే హక్కును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించారన్నారు. ఎన్టీఆర్ ఆస్తిలో, రాజకీయాల్లో అతివలకు సమాన హక్కులు కల్పించారని తెలిపారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ మహిళలు లేకుండా సమాజం మనుగడ కూడా కష్టమేనని పేర్కొన్నారు. మహిళలకు సీఎం సమాజంలో సముచితస్థానం కల్పించారని తెలిపారు. అందువల్లే ఎక్కువగా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అన్నింటినీ ఆడపిల్లల పేరున అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధ్యతతోపాటు సమాజ ప్రగతిలోనూ గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా 603 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.125.87 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. వేడుకల్లో భాగంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్టేషన్‌రోడ్డులోని గాంధీపార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జేసీ సూరజ్ గనోరే, జిల్లా అటవీశాఖ అధిదికారి కృష్ణప్రియ, అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పాల్గొన్నారు. మహిళా పోలీసులు తమ వాహనాలతో వెంట వచ్చారు. మహిళా ఎన్‌సీసీ క్యాడెట్లు, స్కౌట్ విద్యార్థినులు, ఉద్యోగినులు, పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, పోలీసులు పాలుపంచుకున్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి
రవికుమార్
ఘనంగా అంతర్జాతీయ మహిళా
దినోత్సవం
మహిళా గ్రూపులకు బ్యాంకు
లింకేజీ రుణాలు పంపిణీ
మహిళా సాధికారతకు కృషి
Comments
Please login to add a commentAdd a comment