మగువలు అన్ని రంగాల్లో ముందుండాలి
గురజాల: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కోర్టు భవనాల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.అలేఖ్యతోపాటు పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరెడ్డి, బండి వీరభద్రుడు, వీఎన్‌వీ హనుమంతరావు, జక్కా చెన్నకేశవరావు, కె.ప్రభుదాసు, జానీబాష, కె.చలమరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment