పల్నాడు
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
‘యువత పోరు’ను
జయప్రదం చేయాలి
మాచర్ల: రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థులను మోసం చేసి వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయటానికి సిద్ధమైన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 12న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లేకుండా, నిరుద్యోగి భృతి ఇవ్వకుండా.. అదిగో ఇదిగో ! అంటూ చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శించారు. ప్రతి చిన్న విషయానికి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, వారిచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ నెల 12న శాంతియుత నిరసన జరపనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలప్పుడు ఉద్యోగాలు కల్పిస్తానని, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని యువకులను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి తొమ్మిది నెలలైనా వాటి ఊసే లేదని మండిపడ్డారు. వైద్య విద్య ప్రైవేటీకరణలో భాగంగా 17 కళాశాలను ధారాదత్తం చేసే పనిలో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలపై అన్ని వర్గాలతో కలసి 12న ఉదయం 9 గంటలకు నర్సరావుపేట వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలంతా కలవనున్నట్లు వివరించారు. కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పెద్దఎత్తున యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమానికి ఏడు నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇఫ్తార్ సహర్
(సోమ) (మంగళ)
నరసరావుపేట 6.24 5.05
గుంటూరు 6.22 5.03
బాపట్ల 6.22 5.03
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామికి ఖమ్మం జిల్లా దెందుకూరులో ఉన్న 410.34 ఎకరాల భూమిని నేటికీ కూడా నామమాత్రపు ధర పైనే కౌలుదారులు సాగు చేసుకుంటున్నారు. భూములకు ఈనాటికి బహిరంగ వేలం పాటలు నిర్వహించలేని దుస్థితిలో దేవదాయ శాఖ ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాదల, దమ్మాలపాడు, దొండపాడు, దావులూరు, అమరావతి గ్రామాల్లో 267.28 ఎకరాలను దాతలు విరాళంగా ఇచ్చారు. ఈ భూములకు కూడా సరిపడా కౌలు రాకపోయినా గుడ్డి కన్నా మెల్ల మేలు అనే చందాన దేవదాయ శాఖ అధికారులు సరిపెట్టుకున్నారు. నేడు రాజధానిలో ఏకంగా భూములు అమ్మకం చేపట్టినా చలనం లేదు.
అమరేశ్వరునికి వందలాది ఎకరాలు భక్తితో దాతలు సమ ర్పించినప్పటికీ, వాటి రక్షణ కోసం దేవదాయశాఖ సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సర్వీస్‌దారులను గుర్తించి వారి భూములను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇనాం భూములు కూడా ఇంతవరకు లెక్క తేల్చలేదు. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని దేవుని భూములను రక్షించాలి.
– నేరెళ్ల హనుమంతరావు, అమరేశ్వరాలయ పాలక మండలి మాజీ సభ్యుడు, అమరావతి
దేవునికి దాతలు సదుద్దేశంతో ఇచ్చిన భూములను దేవదాయ శాఖ రక్షించడంలో అలసత్వం వహిస్తోంది. ఇప్పటికై నా రెవెన్యూఽ శాఖతో సమన్వయం చేసుకుని అన్యాక్రాంతమయ్యే భూములను కాపాడాలి. వీటిపై లావాదేవీలు జరగుకుండా దేవాదాయశాఖ ప్రత్యేక ప్రణాళికతో పని చేయాలి. లేనిపక్షంలో భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
–కోలా వెంటేశ్వరరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో స్వామికి వివిధ సేవలు అందించటానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు సర్వీస్‌దారులకు 192.96ఎకరాలను ఇనాంగా ఇచ్చారు. ప్రస్తుతం అమరావతిలో రాజధాని పనులు సాగుతుండటంతో ఈ భూమిపై ప్రస్తుతం అందరి చూపు పడింది. ఇందులో సంగీత కళాకారులకు ఇనాంగా ఇచ్చిన 89 సర్వే నంబరులోని 10.70 ఎకరాలను దేవాలయం స్వాధీనం చేసుకుంది. మిగిలిన సర్వే నంబర్లు 201,124, 202,86, 171, 63, 132, 190, 77, 175, 184, 32, 83, 144లో ఉన్న 192.36 ఎకరాలను సర్వీస్ ఇనాంలుగా, మాన్యాలుగా ఇచ్చారు. సర్వీస్ ఇనాంలు పొందిన వారు దేవుని భూముల్లో ప్రస్తుతం కొన్నింటికి పట్టాలు పుట్టించి అమ్మకాలు జరిపినట్లు సమాచారం. మరికొన్నింటికి రెవెన్యూశాఖ ద్వారా పాసు పుస్తకాలు సంపాదించి బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించటంతో కొంతమంది ఇనాందారులు తమ అనుభవంలో గల భూములను తాకట్టు పెట్టడం, లీజు ఒప్పందాలు చేసుకుని లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. మరలా అవే భూములకు అగ్రిమెంరాయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరా భూమి కోట్ల రూపాయలు పలుకుతోంది. దీంతో సర్వీస్, ఇనాం భూములపై రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల కన్ను పడింది. అనుభవదారుల వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాాలతో కొంతమంది రిజిస్టర్ కూడా చేసేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు లీజు ఒప్పందాలు రాస్తున్నారు. కళ్ల ముందే అన్యాక్రాంతమవుతున్న దేవుని భూములను దేవదాయ శాఖ అధికారులు కాపాడాలని భక్తులు కోరుతున్నారు.
7
న్యూస్‌రీల్
సర్వీస్, ఇనాం భూములపై బడాబాబుల కన్ను రాజధాని కారణంగా డిమాండ్ వందలాది ఎకరాల దేవుని భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్ కాపీలు చూపితే రూ. లక్షల్లో అడ్వాన్‌లు
కమిషనర్‌కు నివేదిక
దేవాలయానికి చెందిన సర్వీస్, ఇనాం భూములపై రాష్ట్ర దేవదాయ కమిషనర్‌కు నివేదిక ఇప్పటికే సమర్పించాం. ఈ భూముల సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ఉంచాం. ఈ భూములపై జరిపే అనధికార లావాదేవీలకు గానూ దేవాలయానికి సంబంధం లేదు. ఇప్పటికే సర్వీసుదారులకు నోటీసులు కూడా ఇచ్చాం.
– సునీల్‌కుమార్,
అమరేశ్వరాలయ కార్యనిర్వహణాధికారి
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
Comments
Please login to add a commentAdd a comment