డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
వెల్దుర్తి: లారీని ఓవర్‌టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొని బైక్‌పై వెళుతున్న యువకుడు మృతి చెందిన ఘటన వెల్దుర్తి బస్టాండ్ సెంటర్ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ వెంకట సత్యం(23), మరిపూడి మణికంఠలు ద్విచక్ర వాహనం పై మాచర్లకు వచ్చి వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి గుండ్లపాడుకు వెళ్తున్న సమయంలో వెల్దుర్తి బస్టాండ్ వద్ద 565 జాతీయ రహదారిపై లారీని ఓవర్‌టేక్ చేస్తూ, తప్పించబోయి, పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్నారు. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారమివ్వటంతో వారు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకొని ఇద్దరినీ మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో వెంకట సత్యం మృతి చెందాడు. మణికంఠకు తీవ్రగాయాలు కావటంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట వైద్యశాలకు రిఫర్ చేశారు. మృతి చెందిన వెంకట సత్యంకు భార్య రమాదేవి, ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం రమాదేవి నాలుగు నెలల గర్భిణిగా ఉందని బంధువులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment