నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయించాలి
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి
జె.పంగులూరు: నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి కోరారు. పంగులూరు మండలంలోని చందలూరు దళిత కాలనీ కౌలు రైతులతో సీపీఎం ప్రచార యాత్ర నాయకులు ఆదివారం మాట్లాడారు. పొగాకు అమ్ముడు పోక, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు తెలిపారు. పంట నష్టపరిహారాలు కూడా అందటం లేదని, రాయితీలు కూడా భూ యజమానులకే అందుతున్నాయని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీపీఎం కార్యవర్గ సభ్యురాలు రమాదేవి మాట్లాడుతూ బర్లీ పొగాకును కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రైవేటు కంపెనీలు ఇస్టానుసారంగా ధరలు తగ్గించడం, ఆలస్యంగా కొనడంతో రైతులు నష్టపోతున్నారని ఆమె తెలిపారు. సీపీఎం బాపట్ల కార్యదర్శి సీహెచ్. గంగయ్య మాట్లాడుతూ కౌలు రైతులంగా ఐక్యంగా ఉండాలని తెలిపారు. ఐకమత్యంతో
ఏదైనా సాధించగలమని చెప్పారు. హక్కుల కోసం పోరాడాలని, దాని కోసం సంఘాలుగా ఏర్పడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు రాయిని వినోద్‌బాబు, పార్టీ మండల కార్యదర్శి రామారావు, ప్రభాకర్, సుధాకర్, కౌలు రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment