
వ్యక్తిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మహిళ
క్రోసూరు: మండలంలోని ఉయ్యందన గ్రామంలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడన్న కోపంతో వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన సంఘటన మంగళవారం జరిగింది. జరిగిన సంఘటనపై పోలీసుస్టేషన్ రైటర్ దాసు తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన తమ్మిసెట్టి చిరంజీవి అనే వ్యక్తి ట్రాక్టర్‌లో కూర్చుని ఉండగా దేవండ్ల శ్రీలక్ష్మి అనే మహిళ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడనే కోపంతో వెనుకనుంచి వీపుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. దీంతో వీపు వెనుకభాగం తీవ్రంగా కాలటంతో స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గుంటూరు జీజీహెచ్‌లో క్షతగాత్రుడి స్టేట్‌మెంట్ తీసుకుని కేసు నమోదు చేయనున్నట్లు రైటర్ తెలిపారు.