
ప్రకృతి వ్యవసాయంతో సమృద్ధిగా సూక్ష్మపోషకాలు
బెల్లంకొండ: ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పంటలను సాగు చేయడం, అంతర పంటలను పండించడం ద్వారా అధిక దిగుబడి ఆదాయంతో పాటు భూమికి కావలసిన సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందుతాయని ప్రకృతి వ్యవసాయం అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్ తెలిపారు. బుధవారం మండలంలోని నాగిరెడ్డిపాలెం, పాపాయపాలెం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ విధానంపై గ్రామ సభలు నిర్వహించారు. అడిషనల్ డీపీఎం మాట్లాడుతూ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ 2025– 26 సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు భూమి విస్తీర్ణం, పండించే పంటలు, పాడి పశువుల వివరాలను సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్‌ఎఫ్‌ఏ సైదయ్య, పవన్ కుమార్, అనంతలక్ష్మి, మాధవి, మహాలక్ష్మి, వీఏఏలు అయ్యప్ప, వంశీ, నాయకులు వెన్న వెంకటరెడ్డి, తిప్పిరెడ్డి కిచ్చారెడ్డి, ఓర్చు ప్రసాదరావు, రైతులు పాల్గొన్నారు.
అడిషనల్ డీపీఎం ప్రేమ్‌రాజ్