
బ్లేడ్‌తో ఇరువురిపై దాడి
సత్తెనపల్లి: బ్లేడుతో ఇరువురిపై యువకుడు దాడి చేసిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన గింజుపల్లి అశోక్ కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం పూటుగా మద్యం సేవించాడు. ఇంటి సమీపంలోని ఎనిమిదో తరగతి చదువుతున్న మేడూరు చాణిక్యతో ఏంటి రా నా వైపు చూస్తున్నావ్ అంటూ దూషించి దాడి చేసి బెదిరించడంతో చాణిక్య వెంటనే తల్లి మేడూరు జ్యోతికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఎయిర్‌టెల్ కార్యాలయంలో పనిచేస్తున్న జ్యోతి తన బిడ్డ చాణిక్యపై దాడి చేస్తున్నారంట చూసి రమ్మని తన వద్ద పనిచేసే ఏల్పూరి నవీన్, తూమాటి శ్రీకాంత్‌లను పంపింది. వారు ఇరువురు ఘటన స్థలానికి చేరుకొని ఎందుకు దాడి చేసి, బెదిరిస్తున్నావు అంటూ ప్రశ్నించగా బ్లేడ్ తీసుకొని ఏల్పురి నవీన్ మెడ, చెవి పైన, తూమాటి శ్రీకాంత్ చేతులపై అశోక్‌కుమార్ దాడి చేశాడు. ఎవరైనా దగ్గరకు వస్తే దాడి తప్పదు అంటూ బ్లేడు చూపిస్తూ హల్‌చల్ చేయగా స్థానికులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పట్టణ ఏఎస్‌ఐ సుబ్బారావు పరారైన అశోక్ కుమార్‌ను క్రిస్టియన్ పేటలో పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన క్షతగాత్రుడు ఏల్పూరి నవీన్‌ను ఏరియా వైద్యశాలకు తరలించగా వైద్యులు 10 కుట్లు వేశారు. అలాగే తూమాటి శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఏల్పూరి నవీన్ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.