
ఆర్థిక స్వావలంబనతో మహిళల్లో ఆత్మవిశ్వాసం
బాపట్ల: ఆర్థిక స్వావలంబనతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ పి.ప్రసూనారాణి అన్నారు. ఐసీఏర్ ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా వ్యవసాయ కళాశాల జీవ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఈపూరుపాలెంలో స్వయం ఉపాధి కల్పన నైపుణ్యాలపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసూనారాణి మాట్లాడుతూ మహిళలంతా చేతివృత్తుల్లో నైపుణ్యం పెంచుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా ఎదగడంతో పాటు వ్యాపారవేత్తలుగా రాణించాలని తెలిపారు. ఈపూరుపాలేనికి చెందిన కార్యంపూడి సుబ్బారావు హ్యాండ్ పెయింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్‌పై అవగాహన కల్పించారు.