
రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య
నరసరావుపేటటౌన్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి సంఘటన శుక్రవారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో హుబ్లి ఎక్స్‌ప్రెస్ కింద పడి పెద్దచెరువు ప్రాంతానికి చెందిన గాలి థామస్(70) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన పైలెట్ సమాచారాన్ని నరసరావుపేట రైల్వే పోలీసులకు అందించారు. ఎస్‌ఐ శ్రీనివాసనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.