
పల్నాడు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వినియోగం
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో గంజాయి సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. యువతను లక్ష్యంగా చేసుకొని విక్రయాలకు సాగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి సారి పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ వద్ద బడ్డీకొట్టులో విక్రయిస్తున్న గంజాయి చాక్‌లెట్లు రెండు నెలల క్రితం పట్టుబడ్డాయి. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది మరువకముందే సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో నిమ్మతోట ముసుగులో గంజాయి సాగు వెలుగుచూసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిమితమైన గంజాయి సాగును పల్నాడు ప్రాంతానికి కూడా తేవటం కలకలం రేపుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపాన్ని అవకాశంగా మార్చుకున్న టీడీపీ నేతలు మాదక ద్రవ్యాల అక్రమ సాగుకు తెరలేపుతున్నారు. గత టీడీపీ హయాంలో చిలకలూరిపేట నియోజకవర్గం గొరిజవోలు గ్రామంలో టీడీపీకు చెందిన ఓ వ్యక్తి మిర్చి సాగు ముసుగులో గంజాయి పంట పండించాడు. అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేశారు. తర్వాత తాజాగా అదే మాదిరి కార్యకలాపాలు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రాంతంలో పునరావృతం అయ్యాయి.
టీడీపీ నేత ఆధ్వర్యంలో..
రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో బుధవారం గంజాయి ఆకులు కలిగి ఉన్న ముగ్గురిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చెందిన టీడీపీ నేత పొలంలో తనిఖీలు చేపట్టారు. అక్కడ నిమ్మతోట ముసుగులో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం వాటిని ల్యాబ్‌కు పంపించారు. పొలాల్లో సాధారణ పంటల మాదిరిగా గత కొన్ని నెలలుగా సాగు చేస్తున్న ఈ గంజాయి మొక్కల వ్యవహారాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. వ్యవసాయ పర్యవేక్షణ శాఖ అధికారులు సైతం మౌనంగా ఉన్నారు.
అధికారుల తీరు వల్లే....
రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేయాల్సిన వ్యవసాయ, పోలీస్ శాఖలు మౌనం వహించడంపై పలు విమర్శలకు తావిస్తోంది. అధికారుల మద్దతు లేకుండా ఇలా సాగు సాధ్యపడదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి పొలం కావటంతో అధికారులు మాట్లాండేందుకు కూడా సాహసించటం లేదు.
గంజాయి సాగు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో గంజాయి సాగు విషయం వెలుగు చూసిన తర్వాత జిల్లాలోని అన్ని ఎకై ్సజ్ పోలీస్ అధికారులను అప్రమత్తం చేశాం. తనిఖీలు చేపట్టాలని ఆదేశించామని పేర్కొన్నారు.
– కె. మణికంఠ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్
విద్యార్థులు
గంజాయి సాగు చేస్తే చర్యలు
గతంలో రాష్ట్రంలో తొలిసారి
నరసరావుపేటలో గంజాయి
చాక్‌లెట్లు స్వాధీనం
కళాశాల విద్యార్థులే లక్ష్యంగా
విక్రయాలు
గత ప్రభుత్వంలో సెబ్ ద్వారా
మత్తు పదార్థాల వినియోగం కట్టడి
కూటమి ప్రభుత్వం వచ్చిన
తర్వాత సెబ్‌కు మంగళం
ఏకంగా టీడీపీ నేత పొలంలోనే
నిమ్మతోట ముసుగులో గంజాయి సాగు
జిల్లాలో కొన్ని నెలలుగా ఏదో ఒక ప్రాంతంలో గంజాయి పట్టుబడటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెబ్‌ను తొలగించి, ఎకై ్సజ్ శాఖలో విలీనం చేసింది. కూటమి ప్రభుత్వం ఈగల్ అనే పేరుతో టీమ్‌ను సిద్ధం చేసినా సిబ్బందిని కేటాయించలేదు. ఆశించిన మేర ఫలితాలు దక్కడం లేదు. జిల్లాలో అక్కడక్కడ గంజాయి పట్టుకొని కేసులు నమోదు చేసిన పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. మూలాలపై దృష్టి సారించటంలేదు. నరసరావుపేట కేంద్రంగా గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా పట్టణం నుంచే ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నిర్మానుష్య ప్రాంతాల్లో, పట్టణ శివారు రియల్ ఎస్టేట్ వెంచర్‌లలో యువత గుంపులుగా చేరి గంజాయి తీసుకుంటున్నారు. మత్తుకు బానిసలుగా మారి అనేక మంది నేరాలకు పాల్పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని నివేదికలు సైతం చెబుతున్నాయి.

పల్నాడు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వినియోగం

పల్నాడు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వినియోగం