
● బాబూజీకి ఘననివాళి
నరసరావుపేట: పల్నాడురోడ్డులోని పాత ప్రభుత్వ వైద్యశాలకు ఎదురుగా ఉన్న దేశ మాజీ ఉపప్రధాని, సమతావాది డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శనివారం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జయంతిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్వో ఏకా మురళి, బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్‌పాల్, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వనమా సాంబశివరావు పాల్గొన్నారు.
మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్
నరసరావుపేట: అణగారిన వర్గాల అభ్యున్నతికి, పీడిత, తాడిత ప్రజల ఆశాజ్యోతిగా మెలి గిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ మహనీయు డని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కొనియాడారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదనపు అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్, అదనపు ఏఆర్ ఎస్పీ వి.సత్తిబాబు, ఎస్పీ సీఐలు ఘన నివాళులర్పించారు.