పాస్టర్‌ మృతిపై విచారణకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

పాస్టర్‌ మృతిపై విచారణకు డిమాండ్‌

Apr 7 2025 10:08 AM | Updated on Apr 7 2025 10:08 AM

పాస్టర్‌ మృతిపై విచారణకు డిమాండ్‌

పాస్టర్‌ మృతిపై విచారణకు డిమాండ్‌

వేటపాలెం: పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పాస్టర్ల అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సీహెచ్‌ చార్లెస్‌ ఫీన్నీ డిమాండ్‌ చేశారు. ఆదివారం వేటపాలెం క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆధ్వర్యంలో వందల మందితో దేశాయిపేట నుంచి వేటపాలెం గడియార స్తంభం సెంటర్‌ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పలువురు పాస్టర్లు మాట్లాడుతూ.. ప్రవీణ్‌ పగడాలను హత్య చేశారనే నమ్ముతున్నామని, ఒక దైవజనుడిని హత్య చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటే అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఒక్క ప్రవీణ్‌ను చంపితే వందలాది మంది ప్రవీణ్‌లు పుట్టుకొస్తారని పేర్కొన్నారు. అన్నాలదాసు భాస్కర్‌రావు, పాస్టర్‌ సత్యంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ మార్పు గ్రగోరి, మండల దైవసేవకులు, మహిళలు పాల్గొన్నారు.

ఏఎంసీ చైర్మన్‌ పదవి రాక తమ్ముళ్ల నైరాశ్యం

పర్చూరు(చినగంజాం): పర్చూరు ఏఎంసీ చైర్మన్‌ పదవి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలను ఊరించి ఉసూరుమనిపించింది. ఇది పర్చూరు నియోజకవర్గ పరిధిలో అతి పెద్ద నామినేటెడ్‌ పదవి. శాసన సభ్యుడి తరువాత నియోజకవర్గంలో అంతటి హోదా కలిగిన పదవి కావడంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఇటీవల పలువురు టీడీపీ నేతలు దీనిని ఆశించి భంగపడ్డారు. ఆశావహులు నుంచి స్థానిక శాసనసభ్యుడిపై ఒత్తిడి తీవ్రమైంది. పర్చూరు నుంచి తొలుత ఏఎంసీ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళ కావడంతో బోడవాడ, నూతలపాడు, కొల్లావారిపాలెం, జాగర్లమూడి, స్వర్ణ, చినగంజాం గ్రామాలకు చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని రిజర్వేషన్‌ కేటగిరీని మార్చి బీసీలకు వచ్చేలా చేశారు. కష్టపడి పార్టీ గెలుపు కోసం ఖర్చుపెట్టి పని చేస్తే తమకు చైర్మన్‌ పదవి దక్కలేదని పలువురు టీడీపీ నేతలు నైరాశ్యంలో ఉన్నారు. తమ ఆవేదనను సన్నిహితుల వద్ద వెలిబుచ్చారని సమచారం.

భారీ ర్యాలీకి తరలివచ్చిన

వందల మంది క్రైస్తవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement