
సత్వరమే బాగు చేయించాలి
సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉన్నప్పుడు గ్రామంలో ఏ చోరీ జరిగినా నిందితులను కొద్దిరోజుల్లోనే పోలీసులు పట్టుకున్న ఘటనలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లో సైతం చోరీలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా నిలువరించగలిగారు. ఇప్పుడు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చోరీల బెడద అధికంగా ఉంటుంది. హైవేపై కూడా నిఘా పెట్టాలి. చోరీలు అరికట్టాలంటే ఉన్న కెమెరాలనే సత్వరమే మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలి.
– ఈవూరి లక్ష్మారెడ్డి, నకరికల్లు