
‘యువికా–2025’కు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎంపిక
విజయపురిసౌత్: పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం పేరుతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) యువికా–2025 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 350 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఏపీలో 10 మంది ఎంపిక కాగా పల్నాడు జిల్లానుంచి విజయపురిసౌత్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి పి.వెంకట నాగార్జున ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ మంగళవారం విద్యార్థి వెంకట నాగార్జునను తన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అభినందించారు. ఎంపికై న విద్యార్థులకు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్, దేశంలోని వివిధ స్పేస్ సెంటర్లలో మే 19 నుంచి 30 వరకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్‌పై, స్పేస్‌పై ఆసక్తి కలిగించటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశమని డీఈఓ తెలిపారు. విద్యార్థి పి.వెంకట నాగార్జునను పాఠశాల హెచ్‌ఎం యు.లక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థి తండ్రి పి.వంశీకృష్ణ స్థానిక ఏపీఆర్ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.