
ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి
ఏపీఈజీఏ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్‌బాషా మంగళవారం జిల్లా ఖజానా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.చంద్రశేఖరరెడ్డిని కోరారు. చాంద్ బాషా మాట్లాడుతూ 2025 మార్చి నుంచి కన్వేయెన్స్ అలవెన్సులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేయాలన్నారు. ఎస్‌టిఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన కంప్యూటర్లు చాలా కాలం నుంచి పనిచేయక ఇబ్బంది పడుతున్నారన్నారు. అనంతరం చాంద్ బాషా ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి డీటీఓకు పుష్పగుచ్ఛం అందజేశారు.
అభినందనలు తెలిపిన రిటైర్డ్ ఉద్యోగులు
జిల్లా ఖజానా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.చంద్రశేఖరరెడ్డిని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రెజరీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వర్లు, నాగరాజు పేర్కొన్నారు.