
సాగర్‌డ్యాంపై తెలంగాణ వైపు సీఆర్‌పీఎఫ్ పహారా ఉపసంహరణ
విశాఖపట్నం 234 బెటాలియన్‌కు చార్జ్ అప్పగింత
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న ములుగు 39 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ దళాలు సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు పహారా విధులు ఉపసంహరించుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంధ్రవైపు పహారా కాస్తున్న విశాఖపట్నం 234 బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావుకు 39 ములుగు బెటాలియన్ కమాండెంట్ రాఘవ చార్జ్ అప్పగించారు. ఆంధ్రా వైపు నుంచి సీఆర్‌పీఎఫ్ దళాలు తెలంగాణ వైపు గల డ్యాంమీదకు వెళ్లారు. వీరు జూన్ 23వ తేదీ వరకు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. గత 16 నెలలుగా తెలంగాణ వైపు తెలంగాణ దళాలు, మన రాష్ట్రం నుంచి ఆంధ్ర బెటాలియన్ పహారాలో సాగర్ ప్రాజెక్టు ఉంది. ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రాజెక్టు భద్రత విశాఖపట్నం బెటాలియన్ పహారాలోకి వెళ్లింది.