
లబ్ధి చేకూర్చిన వారిపై నిందలు సరికాదు
పిడుగురాళ్ల: రాజకీయ లబ్ధి చేకూర్చిన వారిపై నిందలు మోపటం సరికాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ అన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పిటల్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర మంత్రి అమిత్ షాకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు లేఖ రాస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయనటం సరికాదన్నారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా గెలిచి ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వారిని, వారి ద్వారా లబ్ధి పొంది ఇలా చేయడం సరైన పద్ధతి కాదన్నారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో నడిరోడ్డుపై హత్యా రాజకీయాలు చేస్తున్న తీరుపై, బార్ షాపు యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపై నిలదీశారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాయాలని ఆయన కోరారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్