
వాట్సాప్‌లో పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులకు సమాధానాలు
నరసరావుపేట: ఇక నుంచి జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల అర్జీలకు వాట్సాప్‌లో సమాధానాలు పంపనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు వెల్లడించారు. వాట్సాప్‌కే పరిమితం కాకుండా అధికారులు తీసుకున్న చర్యల వివరాలను పోస్టు ద్వారా అర్జీదారుడి ఇంటికే పంపుతామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా సైతం ఒక కాపీ నేరుగా ఫిర్యాదుదారుడికి అందిస్తామని పేర్కొన్నారు. సాంకేతికతతో పాటూ సంప్రదాయ సమాచార మార్గాలను సమర్థంగా వినియోగించుకుని పీజేఆర్‌ఎస్‌ను ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ను పటిష్టపరచాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్య మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడంలో మండల స్పెషల్ ఆఫీసర్లు భాగస్వామ్యం కావాలని ఆదేశించామని తెలియజేశారు. మండల స్పెషల్ ఆఫీసర్లు నేరుగా అర్జీదారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదులపై అధికారుల స్పందన, పరిష్కారాల్లో నాణ్యత, ప్రజలతో అధికారులు వ్యవహరించే తీరును సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటనలు ప్రారంభించి సమీక్షలు నిర్వహించారు.
జిల్లాలో వినూత్నంగా చేపట్టిన
కలెక్టర్ అరుణ్ బాబు